వైసీపీలో చేరడంపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే

వైసీపీలో చేరడంపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే
x
TDP mla yeluri sambasiva rao
Highlights

కొంతకాలంగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు టీడీపీని వీడి వైసీపీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

కొంతకాలంగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు టీడీపీని వీడి వైసీపీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.దానికి తోడు ఇటీవల జూమ్ యాప్ లో జరిగిన టీడీపీ మహానాడు కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాలేదు. దాంతో ఎమ్మెల్యే ఏలూరు వైసీపీలో చేరడం ఖాయమైపోయిందని అనుకున్నారంతా.. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఏలూరు ఈ విషయంపై స్పందించారు.. తాను టీడీపీని వీడతానంటూ జరిగిన ప్రచారాన్ని సాంబశివరావు తీవ్రంగా ఖండించారు.

ఇదంతా తనంటే గిట్టనివారు చేస్తున్న అబద్ధపు ప్రచారమని అన్నారు. అంతేకాదు తాను జిల్లాకు చెందిన ఏ ముఖ్య నేతను కలవలేదని, పార్టీ మార్పుపై చర్చించలేదని చెప్పారు. టీడీపీ తనకు రాజకీయ భవిశ్యత్ ఇచ్చిందని అటువంటి పార్టీని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఏలూరు.

Show Full Article
Print Article
Next Story
More Stories