టీడీపీకి షాక్.. వైసీపీలోకి మరో ఎమ్మెల్యే!

టీడీపీకి షాక్.. వైసీపీలోకి మరో ఎమ్మెల్యే!
x
Highlights

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వరుసగా టీడీపీని వీడుతున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. ఇప్పటికే టీడీపీకి చెందిన ఎమ్మేల్యేలు వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కరణం బలరాంలు ప్రభుత్వానికి తమ మద్దత్తు ప్రకటించారు. తాజాగా..

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వరుసగా టీడీపీని వీడుతున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. ఇప్పటికే టీడీపీకి చెందిన ఎమ్మేల్యేలు వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కరణం బలరాంలు ప్రభుత్వానికి తమ మద్దత్తు ప్రకటించారు. తాజాగా వారి బాటలోనే విశాఖపట్నం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కూడా పయనిస్తున్నారు. టీడీపీ అధిష్టానం వైఖరిపై కొద్దిరోజులుగా అసంతృప్తిగా ఉన్న వాసుపల్లి గణేష్.. కొద్దిరోజులుగా వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారు. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజదాని ఏర్పాటుకు తాను అనుకూలమే అని గతంలో ప్రకటించిన వాసుపల్లి.. విశాఖలో రాజధాని వద్దని వ్యతిరేకిస్తున్న టీడీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. వాసుపల్లి చేరికతో టీడీపీకి కంచుకోటగా ఉన్న విశాఖలో పాగా వేయాలని అధికార వైసీపీ భావిస్తోంది.

ఇక12:30నిమిషాలకు క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసి ప్రభుత్వానికి మద్దత్తు తెలపనున్నారు వాసుపల్లి.. అయితే ఆయన చేరికను స్థానిక వైసీపీ నేతలు కొందరు వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. దీంతో అసంతృప్తి నేతలతో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావు ఫోనులో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే టీడీపీకి చెందిన మరో సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరాలని తెగ ఆరాటపడుతున్నారు. అయితే గంటా చేరికను విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాసరావులు వ్యతిరేకిస్తున్నారు. ఈ తరుణంలో గంటా చేరిక కూడా లాంఛనమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నేతలు వరుసగా పార్టీని వీడుతుండటంతో ఉత్తరాంధ్రలో టీడీపీ ప్రాభవం కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories