పార్టీ మార్పుపై స్పందించిన వల్లభనేని వంశీ

పార్టీ మార్పుపై స్పందించిన వల్లభనేని వంశీ
x
Highlights

టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఈ నెల ఆఖరున వైసీపీ తీర్ధం పుచ్చుకునే అవకాశం కనిపిస్తోంది. పార్టీ మార్పుపై వల్లభనేని వంశీ...

టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఈ నెల ఆఖరున వైసీపీ తీర్ధం పుచ్చుకునే అవకాశం కనిపిస్తోంది. పార్టీ మార్పుపై వల్లభనేని వంశీ ఎట్టకేలకు స్పందించారు.. దీపావళి తరువాత పార్టీ మార్పు గురించి చెబుతానన్నారు. తాను 2006లో రాజకీయాల్లోకి వచ్చానని అప్పటినుంచి టీడీపీలోనే ఉన్నానని గుర్తుచేశారు. గత 4 నెలలు నుంచి తన నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుబడిందని అన్నారు. ఇటీవల తనపై అక్రమ కేసు పెట్టారని.. ఈ విషయాలన్నీ సీఎం జగన్‌కు చెప్పానని, ఆయన సానుకూలంగా స్పందించారని వంశీ తెలిపారు. కాగా సీఎం జగన్‌తో శుక్రవారం వల్లభనేని వంశీ సమావేశమైన సంగతి తెలిసిందే. మంత్రులు కొడాలి నాని, పేర్ని నానితో కలిసి సీఎం వద్దకు వంశీ వెళ్లారు. దాదాపు 45 నిమిషాలపాటు సీఎంతో వంశీ సమావేశమై పార్టీ మార్పుపై చర్చించినట్టు తెలుస్తోంది.

కాగా గురువారం చంద్రబాబును కలిసిన వల్లభనేని వంశీ.. శుక్రవారం బీజేపీ ఎంపీ సుజనాచౌదరితోనూ సమావేశయ్యారు. అనంతరం... సీఎం జగన్‌తో భేటీ కావడం రాజకీయంగా పెను చర్చకు దారి తీసింది. తాజా భేటీతో వంశీ టీడీపీని వీడటం ఖాయంగా కనిపిస్తోంది, వంశీ దాదాపు వైసీపీలోకి వెళ్తారని స్పష్టమైంది. వాస్తవంగా వంశీకి జగన్ తో ఎప్పటినుంచో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చాలా ఏళ్ల నుంచి వంశీ వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో దాదాపు ఏడేళ్ల తర్వాత జగన్‌తో వంశీ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏడేళ్ల క్రితం విజయవాడలో రోడ్డుమీద జగన్‌, వంశీ హగ్‌ చేసుకున్నారు. అప్పట్నుంచే ఆయన వైసీపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మళ్లీ సీఎం జగన్‌తో వంశీ భేటీ కావడం చూస్తే.. టీడీపీకి టాటా చెప్పడం లాంఛనమే అంటున్నారు విశ్లేషకుకులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories