Nimmala Ramanaidu: ఏపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఫైర్..

Nimmala Ramanaidu:  ఏపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఫైర్..
x

Nimmala Ramanaidu (file photo)

Highlights

Nimmala Ramanaidu: హామీలిచ్చేటప్పుడు ఆకాశం వైపు చూసి... అమలు చేసేటప్పుడు నేలచూపులా?.. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

Nimmala Ramanaidu: హామీలిచ్చేటప్పుడు ఆకాశం వైపు చూసి... అమలు చేసేటప్పుడు నేలచూపులా?.. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఆకాశం నుంచే బాధితులకు రూ.2వేల సాయం చేశారు. తాగునీరు, ఆహారం లేక ముంపుప్రాంతాల్లోని వృద్ధులు, మహిళలు, చిన్నారులు అలమటిస్తున్నారు. పాలకుల దృష్టంతా కక్షసాధింపులు, వేధింపులు, ఫోన్ ట్యాపింగ్ లపైనే ఉంది. గత ఏడాది రాష్ట్రంలో వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి విదేశాల్లో పర్యటించారు.తిత్లీ తుఫాను వచ్చినప్పుడు జగన్ పాదయాత్రలో ఉండి కూడా ప్రజల ముఖం చూడలేదు.ఆగస్ట్ 8, 2019న ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రి జగన్, ప్రతి వరదబాధిత కుటుంబానికి రూ.5వేలు సాయం చేస్తానని, ఇళ్లుకోల్పోయి, పంటనష్టపోయిన వారిని ఆదుకుంటానని చెప్పాడు.

నాడు ఆయన చెప్పిన హామీలేవి అమలుకాకుండానే, మళ్లీ వరదలు వచ్చాయి. తాజాగా మరలా ముఖ్యమంత్రి ఆకాశం నుంచే బాధితులపై వరాల జల్లు కురిపించి వెళ్లిపోయాడు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సాయం చేయని వాలంటీర్ వ్యవస్థ ఎవరికోసం పనిచేస్తోంది. తిత్లీ, హుద్ హుద్ తుఫాన్లు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా పనిచేశారో ప్రజలందరూ చూశారు. జగన్ లా చంద్రబాబు ఆనాడు రాజప్రాసాదాల్లో కూర్చోలేదు. ప్రజల మధ్యనే ఉండి, గంటలవ్యవధిలోనే తుఫాను బాధితులకు నిత్యావసరాలు, పాలు అందించేలా చేశారు. కరోనా వచ్చినప్పటి నుంచీ ముఖ్యమంత్రి జగన్ కేవలం 5సార్లు మాత్రమే బయటకు వచ్చారు. జగన్ ధోరణి చూస్తుంటే, కరోనా బాధితుల మాదిరే వరద బాధితులు కూడా వరదతో సహజీవనం చేయాలన్నట్లుగా ఉంది అని టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories