టీడీపీకి మరో షాక్.. వైసీపీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే?

టీడీపీకి మరో షాక్.. వైసీపీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే?
x
Highlights

ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలిందని.. గుంటూరు వెస్ట్ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారని సామాజిక...

ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలిందని.. గుంటూరు వెస్ట్ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయన వైసీపీ తరపున నరసరావుపేట పార్లమెంట్ లేదా సత్తెనపల్లి, మంగళగిరి అసెంబ్లీకి నియోజకవర్గం నుంచి ఆయన బరిలో దిగుతారని ఆ వార్త సారాంశం. మోదుగుల టీడీపీలోనే కొనసాగుతున్నా వైసీపీ అధినేత జగన్‌తో ఆయనకు సత్సంబంధాలు మైంటైన్ చేస్తున్నారు. అయితే వేణుగోపాల్ రెడ్డి ఇంకా వైసీపీలో చేరలేదు. చేరేందుకు హైదరాబాద్ వచ్చినట్టు తెలుస్తోంది.

రెండేళ్ల నుంచి మోదుగుల టీడీపీని వీడతారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సడన్ గా మోదుగుల వైసీపీలో చేరడం చర్చనీయాంస్యమైంది. ఆయనకు నరసరావుపేట లేదా సిట్టింగ్ స్థానాన్నిఇస్తానని టీడీపీ అధిష్టానం చెప్పినా ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కాగా మోదుగులను ఆపడానికి రంగంలోకి దిగిన పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ల ప్రయత్నాలు బెడిసికొట్టినట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories