వైసీపీ ఎంపీ జన్మదిన వేడుకలో టీడీపీ సీనియర్ నేత

వైసీపీ ఎంపీ జన్మదిన వేడుకలో టీడీపీ సీనియర్ నేత
x
Highlights

వైసీపీ ఎంపీ జన్మదిన వేడుకలో టీడీపీ సీనియర్ నేత వైసీపీ ఎంపీ జన్మదిన వేడుకలో టీడీపీ సీనియర్ నేత

ఎప్పుడూ ఉప్పు నిప్పులా ఉండే వైసీపీ, టీడీపీ నేతలు.. ఒకచోటా కలిశారు. ఆప్యాయంగా ఒకరినొకరు గౌగిలించుకున్నారు. ఇరువురు క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. ఇంతకీ విషయం ఏంటనుకుంటున్నారా? నిన్న(మంగళవారం) ఒంగోలు ఎంపీ, వైసీపీ సీనియర్ నేత మాగుంట శ్రీనివాసులరెడ్డి పుట్టినరోజు. ఒంగోలులో మాగుంట పుట్టిన రోజు వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు జిల్లా మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమాలపు సురేష్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. వేరే కాక వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. అయితే ఇందులో కొత్తదనం ఏమి లేదు కానీ.. ప్రకాశం జిల్లా టైగర్ గా పిలుచుకునే టీడీపీ అగ్రనాయకుడు కరణం బలరాం కూడా మాగుంటకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి ఈ వేడుకకు వచ్చారు.

దీంతో వైసీపీ నేతలు ఆశ్చర్యపోయారు. నిత్యం వైసీపీని విమర్శించే బలరాం ఈ కార్యక్రమానికి వచ్చారేంటబ్బా అని చర్చించుకోవడం మొదలుపెట్టారు. వాస్తవానికి మాగుంట శ్రీనివాసులరెడ్డి తో కరణం బలరాం పోటీ పడ్డారు. అప్పటినుంచి ఇద్దరి మధ్య రాజకీయ వైరం ముదిరింది. అంతెందుకు మాగుంట టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఇద్దరు నేతలకు పడేది కాదు.. అటువంటిది మాగుంట జన్మదిన వేడుకలకు కుమారుడు వెంకటేష్ తో సహా బలరాం హాజరు కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఇటీవల కరణం కూడా వైసీపీలో చేరతారని వార్తలు వచ్చాయి. అయితే తాను టీడీపీని వీడేది లేదని పలుమార్లు స్పష్టం చేశారు కరణం. ఈ దశలో ఈ పరిణామం చోటుచేసుకోవడం విశేషం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories