పార్టీ మార్పుపై టీడీపీ ఎమ్మెల్యే స్పందన

పార్టీ మార్పుపై టీడీపీ ఎమ్మెల్యే స్పందన
x
Highlights

గత కొంతకాలంగా టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు కొందరు పార్టీని వీడతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మినహా...

గత కొంతకాలంగా టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు కొందరు పార్టీని వీడతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మినహా ఎవరూ బయటికి రాలేదు. ఈ క్రమంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గణబాబు పార్టీ మారతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన బీజేపీలోకి వెళతారని చర్చ నడుస్తోంది. అయితే ఈ ప్రచారంపై ఎమ్మెల్యే గణబాబు స్పందించారు. తనపై వస్తున్న పార్టీ మార్పు ఆరోపణలను ఆయన ఖండించారు.

తాను పార్టీ మారుతాననేది ఊహాజనితమేనని తేల్చారు. పనిగట్టుకొని తనపై ఇలాంటి ప్రచారం చేస్తున్నారని అన్నారు. పార్టీ మార్పు అనేది మీడియా సృష్టేనని అన్నారు. అయితే గతవారం విశాఖ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారని.. ఈ సమావేశానికి అన్ని పార్టీల నేతల వచ్చారని, తాను కూడా వెళ్లనున్నారు.

అంతమాత్రాన బీజేపీలోకి వెళతానని ఎలా డిసైడ్ చేస్తారని ప్రశ్నించారు. పైగా ఆ పార్టీకి అన్ని పార్టీల నేతలు వచ్చారు కానీ టీడీపీకి చెందిన వారినే ఫోకస్ చేశారని అన్నారు. అంతేకాదు 20 మంది ఎమ్మెల్యేలు తనకు టచ్‌లో ఉన్నారని సుజనా చౌదరి చెబితే.. ఆ 20 మంది ఎవరో పేర్లు చెప్పాలని సవాల్ విసిరారు. అలాగే త్వరలో 23 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తారని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు అన్నారని, అలా చూసుకుంటే చంద్రబాబు, బాలకృష్ణ కూడా బీజేపీలోకి వెళ్ళిపోతారా అని ఎద్దేవా చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories