Tuni: అన్న క్యాంటీన్ తెరవాలని కోరుతూ టీడీపీ శ్రేణులు వంటావార్పు

Tuni: అన్న క్యాంటీన్ తెరవాలని కోరుతూ టీడీపీ శ్రేణులు వంటావార్పు
x
Highlights

పేద ప్రజల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ లను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేస్తూ తుని పట్టణంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సోమవారం ఆందో ళన చేశారు.

తుని: పేద ప్రజల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ లను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేస్తూ తుని పట్టణంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సోమవారం ఆందో ళన చేశారు. ప్రభుత్వం అన్నా క్యాంటీన్ లో మూసివేసిన నందుకు నిరసన వ్యక్తం చేస్తూ అన్నా క్యాంటీన్ ఎదుట వంటావార్పు కార్యక్రమం నిర్వహించి పేదలకు ఉచితంగా భోజనాలు పెట్టారు.

నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యనమల కృష్ణుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేదలకు ఆయన భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవాడికి ఐదు రూపాయలకే భోజనం పెట్టాలనే ఉద్దేశంతో అన్న కాంటీన్లు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిందని, కానీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం నిరుపేదల పొట్ట కొట్టే విధంగా అన్న క్యాంటీన్లు మూసి వేయడం సమంజసం కాదన్నారు.

అన్నా క్యాంటీన్ కోసం డబ్బులు లేవు అని చెప్తున్నా ప్రభుత్వం... ఆఫీసులకి వైస్సార్ పార్టీ రంగులు వేయడానికి డబ్బులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ , తాండవ సుగర్స్ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్ లోవరాజు, టీడీపీ నాయకులు మళ్ల గణేష్ , కోడి వెంకటరమణ, నడిగట్ల సూరిబాబు, ఎస్. జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories