ఆ వైసీపీ నేతతో టచ్ లో ఉన్న టీడీపీ నేతలు.!

ఆ వైసీపీ నేతతో టచ్ లో ఉన్న టీడీపీ నేతలు.!
x
Highlights

ఓ వైపు సమీక్షలు, మరోవైపు నాయకుల చేరికతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ఉంది. ఇప్పటికే సగానికి పైగా సీట్ల ఎంపిక పూర్తిచేశారు అధినేత వైయస్ జగన్....

ఓ వైపు సమీక్షలు, మరోవైపు నాయకుల చేరికతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ఉంది. ఇప్పటికే సగానికి పైగా సీట్ల ఎంపిక పూర్తిచేశారు అధినేత వైయస్ జగన్. అయితే ప్రకాశం జిల్లాలోని ఓ నియోజకవర్గంలో పరిస్థితి ఆసక్తికరంగా ఉంది. పశ్చిమ ప్రాంతంలో ఆ పార్టీకి ఎదురులేదనే నానుడి ఉంది. అందులో ముఖ్యంగా మార్కాపురం నియోజకవర్గంలో వైసీపీ కాస్త బలంగానే ఉన్నా వచ్చే ఎన్నికల్లో సీటు ఎవరికీ ఇస్తారో అన్న కన్ఫ్యూషన్ మాత్రం కార్యకర్తలను వెంటాడుతోంది. గత ఎన్నికల్లో మార్కాపురం నియోజకవర్గం నుంచి జంకే వెంకటరెడ్డి వైసీపీ తరుపున గెలుపొందారు. వివాద రహితుడు, సౌమ్యుడిగా పేరున్న జంకే.. ఒంగోలు మాజీ ఎంపీ వైవి. సుబ్బారెడ్డికి సన్నిహితంగా ఉండేవారు. ఈసారి ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానని చెబుతున్నారు ఇక ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కుందూరు పెద్ద కొండారెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చెయ్యాలని భావిస్తున్నారు.

వైసీపీ సీటుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయనకు మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులు రెడ్డి మద్దతు ఉంది. తనకు కాకపోయినా కుమారుడు నాగార్హునరెడ్డికి అయినా టికెట్ ఇవ్వాలని కొండారెడ్డి అధిష్టానాన్ని కోరుతున్నారు. కానీ నియోజకవర్గంలో కొందరి కార్యకర్తల నానుడి మాత్రం మరోలా ఉంది. వైసీపీ నుంచి టీడీపీలో చేరమని ఎమ్మెల్యే జంకేను టీడీపీ నేతలు సంప్రదిస్తే వైసీపీలోనే కొనసాగుతానని జంకే చెప్పారని.. ఈ కారణంతోనే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జంకే వెంకటరెడ్డికే టికెట్ లభిస్తుందని అనుకుంటున్నారు. దీనికి తోడు ఇటీవల జంకే పేరుతోనే నియోజకవర్గానికి ప్రచార రథాలు వచ్చాయి. దాంతో వైసీపీ టికెట్ మళ్ళీ జంకే వెంకటరెడ్డికే అన్న చర్చ మొదలైంది. మరోవైపు కొండారెడ్డితో టీడీపీ నేతలు టచ్ లో ఉన్నారన్న ప్రచారం ఊపందుకుంది. వైసీపీలో టికెట్ దక్కకపోతే టీడీపీ నుండి పోటీ చేస్తారని ఆయన క్యాడర్ భావిస్తోంది. గత ఎన్నికల్లో జంకే వెంకటరెడ్డికి సపోర్ట్ చేస్తే ఈ ఎన్నికల్లో టికెట్ ఇస్తానని జగన్ చెప్పిన మాటనే కొండారెడ్డి నముకున్నారు. మరి జగన్ మాటను నమ్ముకున్న కొండారెడ్డికి టికెట్ దక్కుతుందా లేక ప్రస్తుత ఎమ్మెల్యేకు జగన్ మరోసారి అవకాశం కల్పిస్తారో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories