వల్లభనేని వంశీతో అర్ధరాత్రి వరకు టీడీపీ నేతల చర్చలు.. చివరకు..

వల్లభనేని వంశీతో అర్ధరాత్రి వరకు టీడీపీ నేతల చర్చలు.. చివరకు..
x
Highlights

ఇటీవల టీడీపీకి. గన్నవరం శాసనసభ సభ్యత్వానికి వల్లభనేని వంశీమోహన్‌‌ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఆయనను దారికి తెచ్చుకునేందుకు టీడీపీ అధిష్టానం...

ఇటీవల టీడీపీకి. గన్నవరం శాసనసభ సభ్యత్వానికి వల్లభనేని వంశీమోహన్‌‌ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఆయనను దారికి తెచ్చుకునేందుకు టీడీపీ అధిష్టానం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.. వంశీని బుజ్జగించేందుకు చంద్రబాబు పురమాయించిన కేశినేని నాని, కొనకళ్ల నారాయణ రంగంలోకి దిగారు. బుధవారం రాత్రి మూడున్నర గంటలపాటు కేశినేని నివాసంలో వల్లభనేనితో చర్చించారు. అర్ధరాత్రి వరకు ఈ చర్చలు జరిగినట్టు తెలుస్తోంది.

ఈ సందర్భంగా వల్లభనేని వారికి తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. తాను ఇప్పటికే ఓ నిర్ణయం తీసేసుకున్నాను కాబట్టి ఇక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వారికి స్పష్టం చేశారు. తనపైనా, తన అనుచరులపైనా నమోదవుతున్న కేసుల విషయంలో ఇబ్బంది పడుతున్నట్టు వంశీ వారికి చెప్పినట్టు తెలుస్తోంది. టీడీపీలో ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుందని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కాగా వల్లభనేనితో చర్చల వివరాలను కొనకళ్ల, కేశినేని నానిలు చంద్రబాబుకు వివరించినట్టు సమాచారం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories