జగన్‌ పాలన తుగ్లక్ పరిధి కూడా దాటింది : అనిత

జగన్‌ పాలన తుగ్లక్ పరిధి కూడా దాటింది : అనిత
x
టీడీపీ
Highlights

తుగ్లక్ పాలన పరిధి దాటితే అది జగన్ పాలన అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనిత అన్నారు. రాజధాని నిర్మాణం కోసం డబ్బులు లేవంటూనే 3 రాజధానులు ఎలా నిర్మిస్తారని...

తుగ్లక్ పాలన పరిధి దాటితే అది జగన్ పాలన అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనిత అన్నారు. రాజధాని నిర్మాణం కోసం డబ్బులు లేవంటూనే 3 రాజధానులు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. కులాలు, ప్రాంతాలు అంటూ‌ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చ గొడుతూ అభివృద్ధి అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన దేశాలను ఆదర్శంగా తీసుకోవాలి కానీ జగన్ మాత్రం వెనుకబడిన దేశాల వెంట పరుగులు పెడుతున్నారని అనిత ఎద్దేవా చేశారు.

3 రాజధానుల వల్ల నష్టపోయామనే నిర్ణయానికి దక్షిణాఫ్రికా వచ్చిందని ప్రస్తుతం ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే పరిస్థితుల్లో అది ఉందని మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణను ఎవరూ వ్యతిరేకించరన్న యనమల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విధానాన్ని అనుసరించాలని చెప్పారు. అభివృద్ధి జరగకుండా రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్ర పన్నుతున్నారని ఆరోపించిన ఆయన తుగ్లక్ చర్యల వల్ల వ్యవస్థ ఎలా కుప్పకూలిందో జగన్ వల్ల కూడా వైసీపీ అలానే కుప్పకూలుతుందని మండిపడ్డారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories