జాతీయ మహిళా కమిషన్‌ను కలిసిన టీడీపీ నాయకులు

జాతీయ మహిళా కమిషన్‌ను కలిసిన టీడీపీ నాయకులు
x
Highlights

గుంటూరులోని ఆర్‌ అండ్ బి గెస్ట్‌హౌస్‌లో టీడీపీ నాయకులు ఆదివారం జాతీయ మహిళా కమిషన్‌ను కలిశారు.

గుంటూరులోని ఆర్‌ అండ్ బి గెస్ట్‌హౌస్‌లో టీడీపీ నాయకులు ఆదివారం జాతీయ మహిళా కమిషన్‌ను కలిశారు. సెక్రటేరియట్‌ను అమరావతి నుంచి విశాఖపట్నంకు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై టీడీపీ మహిళా విభాగం, ఇతర నాయకులు కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన టీడీపీ నాయకులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించాలని కమిషన్ సభ్యులకు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.

అమరావతిలో జరుగుతున్న సంఘటనల పై రాష్ట్ర మహిళా కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకోక పోయినప్పటికీ మహిళల సమస్యలను పరిష్కరించడానికి ఢిల్లీ నుండి కేంద్ర మహిళా కమిషన్ అమరావతికి వచ్చిందని టీడీపీ నాయకులు చెప్పారు. గతవారం టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఢిల్లీలో మహిళా కమిషన్ చైర్పర్సన్ ను కలిసి అమరావతిలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. ఈరోజు కమిషన్ సభ్యులను కలిసిన వారిలో గుంటూరు టీడీపీ ఎంపి గల్లా జయదేవ్, మహిళా నాయకురాలు పంచుమర్తి అనురాధ, జెఎసి నాయకులు ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories