logo

కోడెల మృతిపై కేంద్ర సంస్థతో దర్యాప్తు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కోడెల మృతిపై కేంద్ర సంస్థతో దర్యాప్తు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Highlights

కోడెల మృతిపై కేంద్ర సంస్థతో దర్యాప్తు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోడెల మృతిపై కేంద్ర సంస్థతో దర్యాప్తు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు టీడీపీ నేతలు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని కిషన్ రెడ్డిని కోరారు. ఏపీ ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ కిషన్ రెడ్డికి వివరించారు. కుటుంబ సభ్యులపై వేధింపులు ఆపి.. ఏపీలో శాంతి భద్రతలు కాపాడలని పేర్కొన్నారు. కోడెల శివప్రసాదరావు మృతి బాధాకరమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కోడెల మృతిపై కేంద్ర సంస్థతో దర్యాప్తు చేయిస్తామన్నారు. కోడెల మృతిపై ఏపీ సీఎస్, డీజీపీల వివరణ కోరతానన్నారు కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డిని కలిసిన వారిలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణతో పాటు రావుల చంద్రశేఖర్ రెడ్డి, కంభంపాటి రామ్మోహన్ రావు, మద్దాలి గిరిధర్, ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఉన్నారు.


లైవ్ టీవి


Share it
Top