ఆ ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్యే వైసీపీలో చేరతారా..!

ఆ ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్యే వైసీపీలో చేరతారా..!
x
Highlights

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలో వలసలు ఊపందుకుంటున్నాయి. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరేందుకు జగన్ ను...

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలో వలసలు ఊపందుకుంటున్నాయి. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరేందుకు జగన్ ను కూడా కలిశారు. ఒంగోలులో జరిగే సమర శంఖారావరం సభలో ఆమంచి వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. కాగా టీడీపీకి చెందిన అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్) కూడా వైసీపీలో చేరతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈసారి భీమిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనీ అవంతి శ్రీనివాసరావు భావిస్తున్నారు. ఇదే విషయాన్నీ అధిష్టానం వద్ద ప్రస్తావించగా అక్కడ మంత్రి గంటాకు మళ్ళీ టికెట్ ఇస్తానని చంద్రబాబు చెప్పడంతో.. ప్రత్యామ్నాయంగా ఆయన వైసీపీని ఎంచుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ ప్రచారాన్ని అవంతి శ్రీనివాసరావు ఖండించకపోవడంతో ఆయన పార్టీ మార్పు ఖాయమని అంటున్నారు. ఆయనతోపాటు ఉత్తరాంధ్రకు చెందిన మరో ఎంపీ, ఎమ్మెల్యే తోపాటు మరో కీలక నేత కూడా వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆ ముగ్గురు నేతలు వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ అధిష్టానం అప్రమత్తమై.. వారికి ఫోన్ చేయగా వారు ఫోనులో అందుబాటులో లేకుండా పోయినట్టు తెలుస్తోంది. కాగా ఆ ముగ్గురు నేతలు వైసీపీ కీలక నేతలతో ఈ మధ్యాహ్నం చర్చలు జరపనున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories