Vuyyuru: ప్రభుత్వం విధి విధానాలపై టీడీపీ నేతలు ఫైర్

Vuyyuru: ప్రభుత్వం విధి విధానాలపై టీడీపీ నేతలు ఫైర్
x
Highlights

పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు, ఎమ్మెల్సీ యల మంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలపై ఫైర్ అయ్యారు.

ఉయ్యూరు: పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు, ఎమ్మెల్సీ యల మంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలపై ఫైర్ అయ్యారు. వారు పెన్షన్ అందక మనోవేదన చెంది ఉయ్యూరు మండలం జబర్ల పూడి గ్రామానికి చెందిన గుడివాడ సుబ్బలమ్మ (75) మృతి చెందిందని, సుబ్బలమ్మ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షు డు కళా వెంకట్రావు, ఎమ్మెల్సీలు వైవీబీ రాజేంద్రప్రసాద్, బచ్చుల అర్జునుడు, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, కళా వెంకట్రావు మాట్లాడుతూ స్వతంత్ర సమరయో ధురాలుగా కారణం చూపి పింఛన్ తొలగించడం అన్యాయం అని, తెలుగుదేశం పార్టీ హయామంలో 54 లక్షల మందికి పింఛన్లు ఇస్తే, వైసీపీ ప్రభుత్వం వచ్చాక 4.80 లక్షల పింఛన్లు తొలగించారని ఆయన అన్నారు.

ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దళితులకు పేద బడుగు బలహీన వర్గాల వారికీ పింఛ న్లు, రేషన్ కార్డులు, ష్కాలర్ షిప్ లు, కార్పొరేషన్ లోన్లు ఇలా అనేక రకాల సంక్షేమ పథకాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తే మీకు ప్రజలే తగిన బుద్ది చెబుతారని అన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories