Rajahmundry: వైసీపీకి స్థానిక ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత తప్పదు

Rajahmundry: వైసీపీకి స్థానిక ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత తప్పదు
x
Highlights

ఇప్పటికే ప్రజా వ్యతిరేకను మూట కట్టుకున్న వైసీపీకి స్థానిక సంస్థ ఎన్నికల్లో పరాభవం తప్పదని తెలుగుదేశం పార్టీ నాయకులు హెచ్చ రించారు.

రాజమహేంద్రవరం: ఇప్పటికే ప్రజా వ్యతిరేకను మూట కట్టుకున్న వైసీపీకి స్థానిక సంస్థ ఎన్నికల్లో పరాభవం తప్పదని తెలుగుదేశం పార్టీ నాయకులు హెచ్చ రించారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా స్థానిక 39వ డివిజన్ లోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పా రావు, గుడా మాజీ ఛైర్మన్ గన్ని కృష్ణ, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు), ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కాశి నవీన్, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి రెడ్డి మణేశ్వరావు తదితర నాయకులు పర్యటించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మాట్లాడుతూ జగన్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్న క్యాంటీన్లు మూసి వేసి పేదల కడుపుపై కొట్టడం దారుణమన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఫించన్లు, రేషన్ కార్డుల రద్దుతో పాటు ఇసుక కొరత, బోధనా రుసుముల ఎగవేత, ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపు తదితర అంశాల్లో వైకాపా ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు.

అలాగే అందరికి అమ్మఒడి అందిస్తామని నిబంధనల పేరుతో సగం మందికి ఇచ్చి మోసం చేశారన్నారు. గుడా మాజీ ఛైర్మన్ గన్ని కృష్ణ మాట్లాడుతూ మూడు ముక్కల రాజధాని తుగ్లక్ నిర్ణయమని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నిత్యం ప్రజల వెంటే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన వైసీపీ అదే ప్రజలను అన్ని విధాలా ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు.

వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ మోసాలను వివ రించేందుకే ఈ యాత్ర నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రతి ఇంటి తలుపు తట్టి సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్య క్రమంలో ముందుగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories