రెచ్చిపోయిన టీడీపీ, వైసీపీ కార్యకర్తలు.. ఎస్సైకి గాయాలు..

రెచ్చిపోయిన టీడీపీ, వైసీపీ కార్యకర్తలు.. ఎస్సైకి గాయాలు..
x
Highlights

రెచ్చిపోయిన టీడీపీ, వైసీపీ కార్యకర్తలు.. ఎస్సైకి గాయాలు.. రెచ్చిపోయిన టీడీపీ, వైసీపీ కార్యకర్తలు.. ఎస్సైకి గాయాలు..

కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామంలో వినాయక నిమజ్జనం ఊరేగింపులో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఇరువర్గాలు తీవ్రంగా కొట్టుకున్నాయి. ముందుగా గ్రామంలోని వైసీపీ కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడటంతో.. వైసీపీ శ్రేణులు తిప్పికొట్టేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ తీవ్రమైంది. ఓ వర్గం వారు రాళ్లు రువ్వారు దాంతో ఆత్కూరు ఎస్సై శ్రీనివాసరావుతోపాటు ఒక వైసీపీ కార్యకర్త తలకు గాయాలు అయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం కొందరు టీడీపీ నేతలపై వైసీపీ నాయకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories