పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు
x
Highlights

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన ఒకరిద్దరు మంత్రులతో సమావేశం అవుతారని తెలుస్తోంది. విశాఖపట్నంలో జనసేన లాంగ్...

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన ఒకరిద్దరు మంత్రులతో సమావేశం అవుతారని తెలుస్తోంది. విశాఖపట్నంలో జనసేన లాంగ్ మార్చ్ సందర్భంగా వైసిపి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు పవన్.. అవసరమైతే తాను కూడా ఢిల్లీ వెళ్లి మోడీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఈ సందర్భంలో, ప్రస్తుతం పవన్ పర్యటన ఆసక్తిని రేకెత్తించింది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే దేశ రాజధానిలో ఉన్నారు, అక్కడ బిజెపి నాయకులతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రిఅమిత్ షాతో సమావేశమై రాష్ట్ర పరిస్థితులపై చర్చించనున్నారు.

జనసేన చీఫ్ పర్యటనతో టిడిపికి ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అయితే, ఇసుక కొరత, రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల మరణాలపై టిడిపి, జనసేన కలిసి పోరాడుతున్నాయని చెప్పారు. కాగా ఇటీవల, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, చింతాకాయల అయ్యన్న పాత్రుడు అలాగే ఇతర టిడిపి నాయకులు వైజాగ్‌లో ఏర్పాటు చేసిన జనసేన లాంగ్ మార్చ్‌కు తమ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా, గురువారం విజయవాడలో టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు దీక్షకు మద్దతు ఇచ్చారు పవన్.. జెఎస్‌పి తరఫున రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు నిరసన దీక్షకు హాజరయ్యారు.

Keywords : tdp ,atchan naidu, comments, pawan kalyan, delhi tour


Show Full Article
Print Article
More On
Next Story
More Stories