ఎన్నికల కమిషన్ చర్యలపై హర్షం వ్యక్తం చేసిన టీడీపీ నాయకులు

ఎన్నికల కమిషన్ చర్యలపై హర్షం వ్యక్తం చేసిన టీడీపీ నాయకులు
x
Highlights

రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యం పాలన సాగిస్తుండడంతో ఎన్నికల కమిషన్ చర్యలపై హర్షం వ్యక్తం చేస్తున్నామని మండల కన్వీనర్ శంకర్ నాయుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు పిట్టా ఓబుళరెడ్డి పేర్కొన్నారు.

ఓబులదేవరచెరువు: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యం పాలన సాగిస్తుండడంతో ఎన్నికల కమిషన్ చర్యలపై హర్షం వ్యక్తం చేస్తున్నామని మండల కన్వీనర్ శంకర్ నాయుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు పిట్టా ఓబుళరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రాష్ట్ర తెదేపా నేతలు కరోనా పరిస్థితులపై తెలపడంతో స్పందించిన ఎన్నికల కమిషన్ తాత్కాలికంగా వాయిదా వేయడం స్వాగతిస్తున్నమన్నారు.

అధికార పార్టీ దౌర్జన్యాలు ఆయా ప్రాంతాలకు పరిమితం కాదని రాష్ట్రమంతటా రావణకాష్టంగా మార్చారని విమర్శించారు. జిల్లా ప్రధాన అధికారులను, అధికారులపై చర్యలకు సిఫారసు చేయడంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, ప్రజానీకానికి విశ్వాసం కలుగుతుందన్నారు. హింసాత్మక సంఘటనల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల రద్దు అంశాన్ని పరిశీలిస్తున్నామని, పలువురు జిల్లా స్థాయి శాఖాధికారులపై ఎన్నికల కమీషన్ చర్యలకు తెదేపా స్వాగతిస్తుమన్నారు.

రాష్ట్రంలో 2129 యమ్మీటీసీలు, 652 జెడ్పీటీసీలకు గాను 125 స్థానాల్లో పోటీ లేదని, స్థానిక సంస్థల్లో పోటీ లేకుండా ఇంత ఏకపక్షంగా నిర్వహించడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత ఘోరంగా ఎప్పుడూ ఎన్నికలు జరగలేదన్నారు. వైకాపాకి గుణపాఠం చెప్పడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారని, కానీ వారికి ఓటు వేసే అవకాశం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఆరు వారాలు వాయిదా వేయడం కాదని జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి మళ్ళీ తాజాగా నోటిఫికేషన్ తో నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థి నాగిరెడ్డిగారి రాజారెడ్డి, మాజీ కోఆఫ్షన్ టైలర్ నిజాం, ప్రధాన కార్యదర్శి జయచంద్ర, ఎద్దుల నరసింహరెడ్డి, మాజీ యమ్పీటీసీ జయమ్మ, తెలుగుయువత సామల జగన్మోహన్ రెడ్డి, సాంభరెడ్డి, షౌదీ నాగరాజు, షాను,హారును, రామారావు, తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories