అల్లుడి భూముల కోసమే తరలింపు : వర్ల రామయ్య సంచలనం

అల్లుడి భూముల కోసమే తరలింపు : వర్ల రామయ్య సంచలనం
x
Highlights

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూపునకు ఉన్న విశ్వసనీయత, అనుభవం ఏపాటిదో...

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూపునకు ఉన్న విశ్వసనీయత, అనుభవం ఏపాటిదో స్పష్టం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని.. ఈ సంస్థ డైరెక్టర్‌ భట్టాచార్య, విజయసాయిరెడ్డి అల్లుడైన రోహిత్‌రెడ్డికి స్నేహితుడని అని అన్నారు. రోహిత్‌రెడ్డి అరబిందో ఫార్మా కంపెనీ యజమాని అని.. ఈ ఫార్మా కంపెనీకి విశాఖ-విజయనగరం మధ్యన వేలాది ఎకరాలు వున్నాయని ఆయన ఆరోపించారు. ఆ భూముల్లోనే ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉండేలా బోస్టన్‌ గ్రూపు నివేదిక ఇవ్వబోతుందని జోశ్యం చెప్పారు. తమ భూములను అధిక ధరలకు సొమ్ముచేసుకోవాలన్న దురుద్దేశంతోనే విజయసాయిరెడ్డి బోస్టన్‌ గ్రూపును తెరమీదకు తీసుకువచ్చారని ఆరోపించారు.

అసలు ఆ కంపెనీ అడ్వయిజింగ్‌ ఏజెన్సీ పనులు మాత్రమే చేస్తుందని రాజధానులు, కార్యాలయాల తరలింపు, మార్పు గురించి ఏ అనుభవం లేదని అన్నారు. బోస్టన్‌ గ్రూపుతో జగన్‌ ఎప్పుడు ఒప్పందం చేసుకున్నారు, దానికి సంబంధించి న జీవో ఏమిటి, ఆ గ్రూపునకు ఎంత సొమ్ము ఇవ్వబోతున్నారు, అసలు ఆ గ్రూ పు గురించి సీఎంకు ఎలా తెలుసో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బోస్టన్‌ గ్రూపు గతంలో వంద మిలియన్‌ పౌండ్ల స్కామ్‌కు పాల్పడినట్టు ఆధారాలు ఉన్నాయని.. 2017లో పోర్చుగీసు లో బోస్టన్‌ గ్రూపుపై పోలీసులు దాడులు చేశారని ఆరోపించారు.

అవినీతి ఆరోపణలు ఉన్న బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూపునకు 5 కోట్ల ప్రజల భవిష్యత్తును అప్పగించడం సరైన చర్య కాదని అన్నారు. కాగా ఏపీ రాజధాని అంశంపై వైసీపీ ప్రభుత్వం జీఎన్ రావు కమిటీ తోపాటు బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూపునకు కూడా అధ్యయన బాధ్యతలు అప్పజెప్పింది. ఈ సంస్థ జనవరి మూడో తేదీన ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఆ తరువాత జీఎన్ రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూపు నివేదికలపై హై పవర్ కమిటీ పరిశీలించనుంది. ఈ తతంగం పూర్తి అయిన తరువాత రాజధాని తరలింపు ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories