కోడెల చర్యలతో టీడీపీ ప్రతిష్ట మసకబారింది : వర్ల రామయ్య

కోడెల చర్యలతో టీడీపీ ప్రతిష్ట మసకబారింది : వర్ల రామయ్య
x
Highlights

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ చర్యల వల్ల టీడీపీ ప్రతిష్ట మసకబారిందన్నారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య. అసెంబ్లీలో ఫర్నిచర్ తీసుకెళ్లడం...

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ చర్యల వల్ల టీడీపీ ప్రతిష్ట మసకబారిందన్నారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య. అసెంబ్లీలో ఫర్నిచర్ తీసుకెళ్లడం ముమ్మాటికీ తప్పేనని వ్యాఖ్యానించారు. కోడెల అలా చేయకుండా ఉంటే బావుండేదన్నారు. ఎవరిని అడిగి ఫర్నిచర్ తీసుకెళ్లారని.. అసెంబ్లీ కార్యదర్శికి చెప్పి తీసుకెళ్లారా..? అని ప్రశ్నించారు. పార్టీలో ఎంతో సీనియర్ నేతగా, మేధావిగా, విజ్ఞానం కలిగిన కోడెల అలా చేయడం వలన పార్టీకి చెడ్డపేరు వచ్చిందన్నారు వర్ల రామయ్య. ఇదిలావుంటే అసెంబ్లీకి సంబంధించిన ఫర్నిచర్ కోడెల దొంగిలించారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు. ఇంట్లోని ఉంచుకొని ఇప్పుడు అడిగారు కదా అని నేనే తీసుకెళ్లానని కోడెల చెప్పడం విడ్డురంగా ఉందని వారు ఎద్దేవా చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories