వైసీపీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేత వర్ల రామయ్య

వైసీపీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేత వర్ల రామయ్య
x
Highlights

వైసీపీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేత వర్ల రామయ్య

ఇటీవల కాలంలో వైసీపీ, టీడీపీ మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇరు పార్టీల నేతలు పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ సోషల్ మీడియా విభాగంపై టీడీపీ నేత వర్ల రామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు అరండల్ పేట పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు మహిళా నేతల్ని కూడా కించపరుస్తున్నారని పేర్కొంటూ వర్ల రామయ్య తన ఫిర్యాదు చేశారు. టీడీపీకి చెందిన నేతలు, కార్యకర్తలను సోషల్ మీడియా ద్వారా వేధించి మానసిక క్షోభకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో పోలీసులు ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిపి వైసీపీ నేతలపై కఠిన చర్యలపై తీసుకోవాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories