రాజధానిని మార్చాలనుకుంటే మమ్మల్ని కర్ణాటకలో కలపండి : టీడీపీ నేత

రాజధానిని  మార్చాలనుకుంటే మమ్మల్ని కర్ణాటకలో కలపండి : టీడీపీ నేత
x
Highlights

ముఖ్యమంత్రి రాజధానుల పేరిట ప్రజలను కలవరపెడుతున్నారని మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ పి టిక్కారెడ్డి ఆరోపించారు. తన స్వగ్రామంలో విలేకరుల సమావేశంలో...

ముఖ్యమంత్రి రాజధానుల పేరిట ప్రజలను కలవరపెడుతున్నారని మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ పి టిక్కారెడ్డి ఆరోపించారు. తన స్వగ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన మూడు రాజధానుల ప్రచారంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కర్నూలు పార్లమెంటు ఒకప్పుడు కర్ణాటకలో ఉండేదన్న ఆయన.. భాషా పరంగా బళ్లారి జిల్లాలోని ప్రాంతాన్ని ఏపీ లో చేర్చినట్టు గుర్తుచేశారు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే ప్రజలు అక్కడికి వెళ్ళడానికి 22 గంటలు పడుతుందని అన్నారు. రాష్ట్రాన్ని పరిపాలించలేకపోతున్న జగన్ రాజధాని పేరిట రాష్ట్రాన్ని విభజిస్తున్నారని అన్నారు.

టీడీపీ హయాంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్డీఎస్ కుడి కాలువ, వేదావతికి టెండర్లు ఇవ్వగా, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ రద్దు చేశారని అన్నారు. అంతేకాదు జగన్ మోహన్ రెడ్డి ఒక రాజులాగా రాష్ట్రాన్ని పాలిస్తునాన్రని అని టిక్కారెడ్డి దుయ్యబట్టారు. 1956 లో, తమ భూభాగం కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బళ్లారి జిల్లాలోని ఆదోని తాలూకాలో ఉండేదని అన్నారు.. తమ ప్రాంతమంతా కర్ణాటక సంప్రదాయాన్ని కలిగి ఉన్నారని.. అందువల్ల రాజధానిని మార్చాలనుకుంటే కర్ణాటకలో మంత్రాలయం నియోజకవర్గాన్ని విలీనం చేయాలని డిమాండ్ చేశారు తిక్కారెడ్డి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories