కమలం గూటికి చేరిన సాధినేని యామిని

కమలం గూటికి చేరిన సాధినేని యామిని
x
Highlights

నెల కిందట టీడీపీకి రాజీనామా చేసిన సాదినేని యామిని బీజేపీలో చేరారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సమక్షంలో ఆమె కాషాయ కండువా...

నెల కిందట టీడీపీకి రాజీనామా చేసిన సాదినేని యామిని బీజేపీలో చేరారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకొన్నారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ఆమెకు కాషాయ కండువా కప్పి బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో యామిని బీజేపీలో చేరారు. ఆమె తోపాటు కడప జిల్లాలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరులు కూడా కొందరు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.

కాగా 2016 లో టీడీపీలో చేరిన యామిని.. ఆ తరువాత టీడీపీలోని అధికార ప్రతినిధుల్లో కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో మీడియా డిబేట్లలో ఆమె పాల్గొంటూ టీడీపీపై ఈగ వాలనీయకుండా చేసేవారు. ఆ సమయంలో సీఎం జగన్, పవన్ లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. 2019 లో అసెంబ్లీ టిక్కెట్ కూడా ఆశించారు. ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి చెందడంతో ఆమె పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తరువాత నవంబర్‌లో ఆమె టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పదవికి, అలాగే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లకు రాజీనామా లేఖలు పంపించారు. ఆ సందర్బంగా చంద్రబాబు తోడ్పాటు మరువలేనిదని గుర్తుచేసుకున్నారు. దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితుల దృష్ట్యా టీడీపీని వీడుతున్నట్టు లేఖలో యామిని వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories