అది బోస్టన్ రిపోర్ట్ కాదు. జగన్ బోగస్ రిపోర్ట్ : నారా లోకేష్

అది బోస్టన్ రిపోర్ట్ కాదు. జగన్ బోగస్ రిపోర్ట్ : నారా లోకేష్
x
Highlights

అది బోస్టన్ రిపోర్ట్ కాదు. జగన్ బోగస్ రిపోర్ట్ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. అమరావతిని చంపేయాలన్న...

అది బోస్టన్ రిపోర్ట్ కాదు. జగన్ బోగస్ రిపోర్ట్ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. అమరావతిని చంపేయాలన్న దురుద్దేశంతోనే గత ఐదేళ్లలో వైఎస్ జగన్ గారి రాసిన స్క్రిప్ట్ నే మరోసారి బోగస్ రిపోర్ట్ పేరుతో బయటపెట్టారని దుయ్యబట్టారు. పెరిగే జనాభా అవసరాలకు తగ్గట్లుగా పెద్దపెద్ద నగరాల శివార్లలో అభివృద్ది చేసిన సాటిలైట్ సిటీలు,టెక్నాలజీ హబ్ లు, అర్బన్ టౌన్ షిప్ లను గ్రీన్ సిటిలుగా చూపించి అవన్నీ ఫెయిల్ అయ్యాయని చెప్పడం వలన బిసిజి రిపోర్ట్ చిత్తశుద్ది ఏంటో అర్ధం అవుతుందని అన్నారు లోకేష్.

అన్ని నగరాల గురించి చెప్పిన రిపోర్టులో సంవత్సరానికి లాక్షా ముప్పై వేల కోట్ల ఆదాయం వస్తున్న గ్రీన్ ఫీల్డ్ సిటీ అయిన సైబరాబాద్ ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? అని లోకేష్ బీసీజీ సంస్థకు ప్రశ్న సంధించారు. అంతేకాదు రాజధాని ఏర్పాటుకు అమరావతి అనువైన ప్రాంతం అని చట్టబద్ధత ఉన్న శివ రామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందని లోకేష్ వెల్లడించారు. కానీ అమరావతి ముంపునకి గురవుతుంది, భూమి స్వభావం వలన నిర్మాణ వ్యయం పెరుగుతుంది అంటూ అసత్య ఆరోపణలు చేసి కోర్టుకెళ్లి మొట్టికాయలు తిన్నారని లోకేష్ అన్నారు. కోర్టు మొట్టికాయలు వేసినా జగన్ వక్ర బుద్ధి మారలేదని.. కోర్టులు చివాట్లు పెట్టిన అంశాలనే రిపోర్టులో పెట్టి అది బోగస్ రిపోర్ట్ అని జగన్ గారే స్వయంగా ప్రకటించినట్టుందన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories