'రాజధాని అమరావతిలోనే వస్తుందని నాకు తెలుసు.. నా దగ్గర డబ్బులు లేవు నేను కొనలేదు' : టీడీపీ నేత సంచలనం

రాజధాని అమరావతిలోనే వస్తుందని నాకు తెలుసు.. నా దగ్గర డబ్బులు లేవు నేను కొనలేదు : టీడీపీ నేత సంచలనం
x
Highlights

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనందబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలోనే రాజధాని వస్తుందని తనకు తెలుసన్నారు. అయితే తన వద్ద డబ్బు లేని...

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనందబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలోనే రాజధాని వస్తుందని తనకు తెలుసన్నారు. అయితే తన వద్ద డబ్బు లేని కారణంగానే తిలిసినా కొనుక్కోలేదని వ్యాఖ్యానించారు. ఓ ఛానల్ లో నిన్న(గురువారం) జరిగిన చర్చా కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారాయన. వైసీపీ అధికార ప్రతినిధి కనుమూరు రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఎక్కడో అనంతపురం జిల్లా ఉరవకొండ కు చెందిన పయ్యావుల కేశవ్ అమరావతిలో భూములు కొన్నారు.. మరి అమరావతి ప్రాంతానికే చెందిన నక్కా ఆనందబాబు, ఉత్తరాంధ్రకు చెందిన అచ్చెన్నాయుడు, బండారు సత్యనారాయణ ఇక్కడ ఎందుకు భూములు కొనలేదని ఆనందబాబును ప్రశ్నించారు.

దానికి ఆనందబాబు బదులిస్తూ.. 'అమరావతిలోనే రాజధాని వస్తుందని నాకు తెలుసు.. కానీ నా దగ్గర డబ్బు లేని కారణంగా కొనలేదు' అని చెప్పారు. అంతేకాదు అమరావతిలోనే రాజధాని వస్తుందని దాదాపు అందరికి తెలుసని అన్నారు. అలాగే టీడీపీ నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిపారంటూ వైసీపీ ప్రభుత్వం కొందరి పేర్లను బయటపెట్టింది వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆనందబాబు వైసీపీని ప్రశ్నించారు. కాగా అమరావతిలో 4070 ఎకరాల్లో టీడీపీ నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిపారని ప్రభుత్వం ఆధారాలతో సహా పేర్లను బయటపెట్టింది. దీనిపై ప్రస్తుతం న్యాయనిపుణులతో చర్చిస్తోంది ప్రభుత్వం.. త్వరలోనే ఇన్సైడ్ ట్రేడింగ్ పై సిబిఐ లేదంటే లోకాయుక్త విచారణ జరిపే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలే పేర్కొంటున్నాయి.

మంత్రివర్గ ఉపసంగం కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ పై కూలంకషంగా చర్చించి ఆధారాలు ఉన్నాయని నమ్మి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రాజధాని ప్రకటనకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు సహా మాజీ మంత్రులు నారా లోకేష్, పత్తిపాటి పుల్లారావు, రావేలా కిషోర్ బాబు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పరిటాల సునీత, యనమల రామకృష్ణుడు అల్లుడు, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మాజీ ఎమ్మెల్యేలు జీవీఎస్‌ ఆంజనేయులు, ధూళిపాళ్ల నరేంద్ర, కొమ్మాలపాటి శ్రీధర్ తదితరులు తమ బినామీలతో భూములు కొనుగోలు చేసినట్టు ప్రభుత్వం ఆరోపిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories