Top
logo

Jaggampeta: వైసీపీ రాక్షస పాలనను అంతమొందించాలి: జ్యోతుల నెహ్రూ

Jaggampeta: వైసీపీ రాక్షస పాలనను అంతమొందించాలి: జ్యోతుల నెహ్రూజ్యోతుల నెహ్రూ
Highlights

మండలంలోని మర్రి పాక, గొల్లలగుంట గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు.

జగంపేట: మండలంలోని మర్రి పాక, గొల్లలగుంట గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఒక్కరిని కలిసి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ... తొమ్మిది రద్దులు, తొమ్మిది బారాలు, తొమ్మిది మోసాలతో... నవమాసాల పాలనా నవ మోసాలుగా మారిందని ఆరోపించారు.

రేషన్ కార్డులు, పింఛన్లు అనేకమంది అర్హులకు తొలగించారని... మద్యం, ఇసుక, ఆర్టీసీ, విద్యుత్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యులకు పెనుభారం మెపరని ఆరోపించారు. వైసిపి రాక్షస పాలనను అంతమొందించాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ ఎస్వీఎస్ అప్పలరాజు, పార్టీ సీనియర్ నాయకులు కోర్పు లచ్చయ్య దొర, మండల పార్టీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం, జంపన సీతారామచంద్ర వర్మ, కొత్త కొండ బాబు, అడబాల భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.


Web TitleTDP Leader Jyothula Nehru Sensational Comments on YCP Government
Next Story


లైవ్ టీవి