టీడీపీలో మరో బిగ్ వికెట్ డౌన్..

టీడీపీలో మరో బిగ్ వికెట్ డౌన్..
x
Highlights

ఎన్నికలు సమీపిస్తున్నాయి.. నేతలు తమ రాజకీయ భవిశ్యత్ ను ప్రశ్నించుకుంటున్నారు. ఏ పార్టీలోకి వెళితే ఏం ప్రయోజనం ఉంటుందో అన్న లెక్కలు వేసుకుంటున్నారు. ఈ...

ఎన్నికలు సమీపిస్తున్నాయి.. నేతలు తమ రాజకీయ భవిశ్యత్ ను ప్రశ్నించుకుంటున్నారు. ఏ పార్టీలోకి వెళితే ఏం ప్రయోజనం ఉంటుందో అన్న లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ గట్టునుంటావా.. ఈ గట్టుకొస్తావా అంటూ పార్టీలు తొందర పెడుతున్నాయి. దశాబ్దాలుగా రాజకీయం చేసిన కుటుంబాలు సైతం సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

అనంతపురం జిల్లాలో బి నారాయణరెడ్డి అంటే అందరికి సుపరిచితమే.. జిల్లాలో మరో వైయస్ గా పేరుగాంచిన రాజకీయ నేత. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడు. నారాయణరెడ్డి వారసుడిగా చిన్న తమ్ముడు గురునాధ్ రెడ్డి 2009 లో రాజకీయ రంగప్రవేశం చేసి అనంతపురం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత గురునాధ్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో పోటీచేసి టీడీపీ అభ్యర్థి ప్రభాకర్ చౌదరిపై ఓటమి చెందారు. ఈ క్రమంలో నారాయణరెడ్డి కాలం చేశారు. అయితే ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న కారణంగా అనంతపురం అర్బన్ లో గురునాధ్ రెడ్డిని ఇంచార్జ్ గా తప్పించి నదీమ్ అహ్మద్ ను నియమించారు జగన్. ఈ పరిణామం గురునాధ్ రెడ్డికి రుచించలేదు.

దాంతో గురునాధ్ రెడ్డి, ఆయన అన్న ఎర్రిస్వామిరెడ్డి ఇద్దరు కలిసి టీడీపీలో చేరిపోయారు. అయితే టీడీపీలో చేరి సంవత్సరం అయినా తమకు సరైన ప్రాధాన్యత దక్కలేదన్న అభిప్రాయం వారిలో ఉంది. పలుమార్లు పార్టీ అధిష్టానంతో చర్చించినా లాభం లేకుండా పోయింది. దాంతో బ్యాక్ టు పెవిలియన్ అంటూ తిరిగి వైసీపీలో చేరేందుకు గురునాధ్ రెడ్డి, ఆయన సోదరుడు ఎర్రిస్వామిరెడ్డిలు సిద్ధమయ్యారు. ఇవాళ(డిసెంబర్ 30) తన రాజీనామా విషయంపై మాట్లాడిన గురునాధ్ రెడ్డి.. చంద్రబాబునాయుడు పాలన బాగుందని తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తప్పుచేశాను.. ఇక ఆ పార్టీలో ఉండను టీడీపీకి రాజీనామా చేస్తున్నా.. అంటూ ప్రకటించారు. దాంతో అనంతపురం టీడీపీ షాక్ కు గురైంది. కాగా టీడీపీకి రాజీనామా చేసిన గురునాధ్ రెడ్డి రేపు లేదా ఎల్లుండి జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories