Devineni Uma Fires on AP Govt: ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి విమర్శలు..

Devineni Uma Fires on AP Govt: ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి విమర్శలు..
x
Devineni Uma (File Photo)
Highlights

Devineni Uma Fires on AP Govt: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణపై స్పందిస్తూ మాజీ ఎంపీ టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు.

Devineni Uma Fires on AP Govt: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణపై స్పందిస్తూ మాజీ ఎంపీ టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయని.. ఎంతో మంది కోవిడ్ బారిన పడ్డారని, మరణాలు సంఖ్య కుడా 2,500దాటిందని.కవిడ్ పరిక్షలు చేసిన వారిలీ సుమారు 16.5 శాతం మందికి పాజిటివ్ నిర్ధారణ అవుతుంది. రాష్ట్రంలో కవిడ్ వైద్య సదుపాయలపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నరు.

''మూడులక్షలకు చేరువలో కేసులు,2500దాటిన మరణాలు. రాష్ట్రంలో విస్తరిస్తున్నకరోనా. పరీక్షలుచేసిన వాళ్లలో 16.5%మందికి నిర్ధారణ. వైద్యం,వసతి సౌకర్యాలపై ప్రజలఅసంతృప్తి. కరోనాకట్టడికి ఏంచర్యలు తీసుకుంటున్నారు? ఎక్కడెక్కడ ఎన్నినిధులు ఖర్చుపెట్టారో శ్వేతపత్రం విడుదలచేస్తారా?'' అంటూ ఏపీ సర్కారుపై దేవినేని ఉమ మండిపడ్డారు.


ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. శనివారం కొత్తగా 8,732 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ ని విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రములో కరోనా కేసుల సంఖ్య 2,81,817 కి చేరుకుంది. ఇందులో 88,138 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటివరకూ 1,91,117 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక తాజాగా కరోనాతో మరో 87 మంది మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య 2,562 కి చేరుకుంది.

ఇందులో చిత్తూరు జిల్లాలో 10, గుంటూరు జిల్లాలో 9 మంది, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 8 మంది; అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో 7,నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో 6, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో 5, కృష్ణా జిల్లాలో 3 చొప్పున మరణించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories