పార్టీ మార్పుపై ఎట్టకేలకు స్పందించిన దేవినేని అవినాష్

పార్టీ మార్పుపై ఎట్టకేలకు స్పందించిన దేవినేని అవినాష్
x
Highlights

తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ త్వరలో టీడీపీని వీడతారని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఈనెల 23న జగన్ సమక్షంలో వైసీపీలో

తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ త్వరలో టీడీపీని వీడతారని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఈనెల 23న జగన్ సమక్షంలో వైసీపీలో చేరతారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై దేవినేని అవినాష్ స్పందించారు. ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే కొనసాగుతానన్నారు దేవినేని అవినాష్‌.. టీడీపీలో తన ఎదుగుదల చూసి ఓర్వలేని కొందరు పనిగట్టుకుని తాను పార్టీ వీడుతున్నా నంటూ ప్రచారం చేస్తున్నానని.. తనకు పార్టీమారే ఆలోచనే లేనే లేదని స్పష్టం చేశారు.

టీడీపీ కార్యకర్తలకు.. దేవినేని కుటుంబ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వదంతులను ఎవరూ నమ్మవద్దు. పార్టీ అధినేత చంద్రబాబు, యవనేత లోకేష్‌ చూపిన మార్గంలో నడుస్తానని.. ప్రజాసమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా తెలుగు యువత ఆధ్వర్యంలో పోరాడతామని వెల్లడించారు. ఇక దేవినేని అవినాష్ నుంచి ఈ రేంజిలో రిప్లై రావడంతో టీడీపీ నేతలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

కాగా గత ఎన్నికల్లో గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు అవినాష్.. మంత్రి కొడాలి నాని చేతిలో భారీ ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. తొలుత ఆయన విజయవాడ లోకల్ నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలని భావించారు. అయితే అధినేత చంద్రబాబు ఆదేశాలతో గుడివాడ వెళ్లాల్సి వచ్చింది. అయితే అనూహ్య ఓటమి అనంతరం టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ మార్పు వార్తలను అవినాష్ కొట్టిపారేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories