logo

నా నివాసాన్ని టార్గెట్ చేస్తారా..? నా భద్రతతోనే ఆటలాడతారా.. ?

నా నివాసాన్ని టార్గెట్ చేస్తారా..? నా భద్రతతోనే ఆటలాడతారా.. ?
Highlights

వరద నీటిలో నిర్వహణలో జగన్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. సక్రమంగా నీటి...

వరద నీటిలో నిర్వహణలో జగన్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. సక్రమంగా నీటి నిర్వహణ చేస్తే, నీళ్లు వెనక్కి వచ్చేవా.. అంటూ ప్రశ్నించారు. వరద నిర్వహణపై ముఖ్యమంత్రి ఒక్క సమీక్ష కూడా చేపట్టలేదని విమర్శించారు. ముందు బాధితులకు సహాయ చర్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పాలిట్‌బ్యూరో సభ్యులు, ఎంపీలు, టీడీఎల్‌పీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. తన ఇంటిపై డ్రోన్ల తిరిగిన అంశాన్ని కూడా చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై డ్రోన్లు తిప్పడం ఏంటని ప్రశ్నించారు. దీన్ని వెనక ఎవరు ఉన్నారో తెలపాలని డిమాండ్ చేశారు.


లైవ్ టీవి


Share it
Top