టీడీపీకి మరో ఎదురుదెబ్బ.. నేడు బీజేపీలోకి మాజీ మంత్రి..

టీడీపీకి మరో ఎదురుదెబ్బ.. నేడు బీజేపీలోకి మాజీ మంత్రి..
x
Highlights

టీడీపీకి మరో ఎదురుదెబ్బ.. నేడు బీజేపీలోకి మాజీ మంత్రి.. టీడీపీకి మరో ఎదురుదెబ్బ.. నేడు బీజేపీలోకి మాజీ మంత్రి..

కడపజిల్లాలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి నేడు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. ఇందుకోసం ఆయన బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన వెంట పలువురు ద్వితీయశ్రేణి నాయకులు కూడా ఢిల్లీ వెళ్లారు. కడప జిల్లాలో టీడీపీకి పెద్దదిక్కుగా ఉన్న ఆదినారాయణరెడ్డి టీడీపీని వీడుతుండటంతో ఆ పార్టీ అగ్రనాయకత్వం అప్రమత్తమైంది. ఆది వెంట ఇంకెవరు వెళ్లకుండా చూడాలని పెద్దలను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. మరోవైపు కడపలో ఎల్లుండి నుంచి బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో చాలా మంది టీడీపీ నేతలు బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. కాగా ఇప్పటికే ఆ జిల్లాకు చెందిన ఎంపీ సీఎం రమేష్ బీజేపీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories