టీడీపీకి మరో షాక్.. వైసీపీలో చేరనున్న కీలకనేత

టీడీపీకి మరో షాక్.. వైసీపీలో చేరనున్న కీలకనేత
x
Highlights

ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. నిన్న వరుపుల రాజాతో మళ్ళి రాజీనామాల పర్వం కొనసాగుతోంది.. విశాఖ జిల్లా టీడీపీ...

ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. నిన్న వరుపుల రాజాతో మళ్ళి రాజీనామాల పర్వం కొనసాగుతోంది.. విశాఖ జిల్లా టీడీపీ కీలకనేత అడారి ఆనంద్ టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. రేపు విజయవాడకు ఆడారి వర్గం చేరుకోనుంది. ఎల్లుండి సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు అడారి.. తనతోపాటు ఆయన సోదరి రమాకుమారి కూడా వైసీపీలో చేరనున్నట్టు సమాచారం. కాగా వీరిద్దరూ విశాఖ డైరీపై ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. ఆడారి ఆనంద్ తాజా ఎన్నికల్లో అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి టీడీపీ తరుపున పోటీ చేశారు. అడారి తిరుగుబాటుతో విశాఖ డైరీ మీద టీడీపీ పట్టుకోల్పోనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories