Top
logo

ఆ జిల్లాలో టీడీపీ కీలక నేత వైసీపీలోకా..?

ఆ జిల్లాలో టీడీపీ కీలక నేత వైసీపీలోకా..?
X
Highlights

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జంపింగులు ఊపందుకుంటున్నాయి. టీడీపీనుంచి వైసీపీలోకి ఇటీవల భారీగానే చేరికలు జరిగాయి....

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జంపింగులు ఊపందుకుంటున్నాయి. టీడీపీనుంచి వైసీపీలోకి ఇటీవల భారీగానే చేరికలు జరిగాయి. ప్రస్తుతం వైసీపీ అధినేత వైయస్ జగన్ విదేశీ పర్యటనలో ఉన్నందున చేరికలు లేవని.. జగన్ ఇండియాకు రాగానే మరికొంతమంది నేతలు వైసీపీలో చేరేందుకు రెడీగా ఉన్నారని వారంటున్నారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా నుంచి టీడీపీకి చెందిన ఓ కీలక నేత కూడా వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇంతకీ ఆ కీలక నేత ఎవరు? అని అడిగితే మాత్రం సీక్రెట్ అంటున్నారు.

పేరు చెబితే టీడీపీ అప్రమత్తమవుతుందనే వారు చెప్పడం లేదని తెలుస్తోంది. పార్టీ మారతారని ఇటీవల జిల్లాలో జోరుగా వినిపించిన పేరు మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిదే.. 10 రోజుల కిందట సీఎం చంద్రబాబును కలిసిన ఆయన మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. దాంతో మాగుంట వైసీపీలో చేరడం ఖాయమైందన్న వాదన వినబడుతోంది. ఇక జిల్లాలో కీలకంగా ఉన్న నేతల్లో మరొకరు కరణం బలరాం.. ఆయన టీడీపీని వీడటం లేదని ఇటీవల స్పష్టం చేశారు. దీంతో వైసీపీలో చేరేది మాగుంటనే అన్న చర్చ మొదలైంది.

Next Story