టీడీపీలో చీలిక రాబోతోంది.. వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

టీడీపీలో చీలిక రాబోతోంది.. వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు
x
చంద్రబాబు,శ్రీకాంత్ రెడ్డి
Highlights

టీడీపీలో చీలిక రాబోతోందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని...

టీడీపీలో చీలిక రాబోతోందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు వయసు పెరిగిందని, అందుకే ఆయన ఏదోదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కియా మోటార్స్ తరలిపోతుందంటూ చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీలో తర్వలోనే చీలిక రాబోతోంది వ్యాఖ్యానించారు. చంద్రబాబు బతుకంతా గ్రాఫిక్స్ చూపిస్తూ.. బతుకు అని తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు అసత్య కథనాలు రాయించి ఆనందపడుతున్నారన్నారని, ఇప్పటి వరకు రాష్ట్రానికి ఏ పరిశ్రమలు తెచ్చారో చెప్పాలని సవాల్ విసిరారు. ఆయనలో ఆందోళన కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు పిచ్చిపట్టినట్టుందని, సీఎం వైఎస్ జగన్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ చేసే పనులు చూడలేక బురద జల్లుతున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. జెడ్ ప్లస్ భద్రత లేకుండా చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లగలరా అని ప్రశ్నించారు.

చంద్రబాబు రౌడీలా మాట్లాడుతున్నారని విమర్శించారు. దమ్ముంటే తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాష్ట్రం నుంచి ఏ పరిశ్రమ వెళ్లదని లేదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పరిశ్రమలు వస్తాయే కానీ, వెళ్లవని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంతకుముందు చంద్రబాబు జగన్‌ పిచ్చి తుగ్గక్‌ నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ పతనైపోయిందని అన్నారు. ఎక్సైజ్ ఆదాయం గణనీయంగా తగ్గింపోయిదని ఆరోపించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories