Nara Lokesh as Deputy CM?: నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్‌పై స్పందించిన టీడీపీ

Nara Lokesh as Deputy CM?: నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్‌పై స్పందించిన టీడీపీ
x
Highlights

TDP reaction on Deputy CM post to Nara Lokesh: నారా లోకేష్‌ను ఏపీ డిప్యూటీ సీఎం చేయాలని కొంతమంది టీడీపీ నేతలు చేస్తోన్న డిమాండ్స్‌పై పార్టీ అధిష్టానం...

TDP reaction on Deputy CM post to Nara Lokesh: నారా లోకేష్‌ను ఏపీ డిప్యూటీ సీఎం చేయాలని కొంతమంది టీడీపీ నేతలు చేస్తోన్న డిమాండ్స్‌పై పార్టీ అధిష్టానం స్పందించింది. ఈ విషయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఎలాంటి వ్యాఖ్యలు చేయడానికి వీల్లేదని పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

ఇలాంటి విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా కూటమి నేతలు కూర్చుని చర్చించుకోవడం జరుగుతుందని తెలుగు దేశం పార్టీ శ్రేణులకు చెప్పింది. ఇక ఈ విషయంలో మీడియా ఎదుట ఎవ్వరూ ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయకూడదని తేల్చిచెప్పింది.

రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియా చర్చనియాంశంగా మారిన నారా లోకేష్‌‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్

నారా లోకేష్ ను ఏపీ ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని ఇటీవల కాలంలో పలువురు టీడీపీ నేతలు పార్టీ నాయకత్వాన్ని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు తరువాత తెలుగు దేశం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నారా లోకేష్ కష్టపడ్డారని, అందుకే ఆయనకు అన్నివిధాల ఆ అర్హతలు ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు.

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మ మాట్లాడుతూ, తెలుగు దేశం పార్టీ సభ్యత్వ నమోదులో నారా లోకేష్ గ్రాండ్ సక్సెస్ అయ్యారన్నారు. నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇదే పిఠాపురం నియోజకవర్గం నుండి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం కాదు... ఏకంగా ముఖ్యంత్రినే చేయాలనే వాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఇలా తెలుగు దేశం పార్టీ నేతలు ఒకరి తరువాత ఒకరిగా నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ వినిపిస్తుండటంతో ఏపీ రాజకీయాల్లో ఇదొక హాట్ టాపిక్ అయింది. ఇదే విషయమై సోషల్ మీడియాలోనూ తెలుగు దేశం పార్టీ, జనసేన పార్టీలకు అనేక అనుకూల, ప్రతికూల చర్చలు జరుగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories