స్వంత జిల్లాలోనే చంద్రబాబుకు షాక్..మాజీ ఎమ్మెల్యే రాజీనామా!

స్వంత జిల్లాలోనే చంద్రబాబుకు షాక్..మాజీ ఎమ్మెల్యే రాజీనామా!
x
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఈ మధ్యే లాక్ డౌన్ నిబంధనలను విధించారంటూ కేసు నమోదు చేయగా, తాజాగా తన స్వంత జిల్లాలో...

టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఈ మధ్యే లాక్ డౌన్ నిబంధనలను విధించారంటూ కేసు నమోదు చేయగా, తాజాగా తన స్వంత జిల్లాలో వెన్నంటి ఉండే మాజీ ఎమ్మెల్యే పార్టీని వీడుతున్నట్టు రాజీనామా ప్రకటించారు. ఇప్పటికే అధికారం లేక నానా ఇబ్బందులు పడుతున్న చంద్రబాబుకు ఈ ఘటన శరాఘాతంగా పరిణమించింది.

గత కొన్ని రోజులుగా రాజకీయంగా గడ్డుకాలం ఎదర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. ఆయన సొంత జిల్లా చిత్తూరులో కీలకంగా ఉన్న నేత, మాజీ ఎమ్మెల్యే సడన్‌గా పార్టీకి రాజీనామా చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా పనిచేస్తూ వచ్చిన ఏఎస్ మనోహర్.. ఉన్నట్లుండి తన రాజీనామాను ప్రకటించారు.

అంతేకాదు గురువారం రాత్రి తన రాజీనామా లేఖను చంద్రబాబు నాయుడుకు కూడా పంపారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ.. కొద్ది రోజులు రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని, ఆ తరువాత వేరే పార్టీలో చేరడంపై నిర్ణయాన్ని ప్రకటిస్తానని అన్నారు.

కాగా 1994 నుంచి టీడీపీలో కొనసాగుతున్న మనోహర్.. ఆ ఏడాది అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సీకే బాబు చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత 1999లోనూ టీడీపీ తరఫున పోటీ చేసిన ఆయన.. ఆ సంవత్సరం కూడా ఓటమి పాలయ్యారు. 2004లో మనోహర్ గెలిచినప్పటికీ.. టీడీపీ అధికారాన్ని కోల్పోయింది.

ఇక 2013లో వైసీపీలో చేరిన ఆయనకు 2014లో జగన్ పార్టీ టికెట్‌ను ఇవ్వలేదు. ఈ క్రమంలో 2019 ఎన్నికల ముందు మళ్లీ సొంతగూడు టీడీపీలోకి వెళ్లారు మనోహర్. అయితే గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లోనూ ఆయన ఓడిపోయారు. అయినప్పటికీ.. మొన్న జరిగిన మహానాడు వరకు టీడీపీ పార్టీ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించిన మనోహర్.. సడన్‌గా రాజీనామా చేయడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ఈ మాజీ ఎమ్మెల్యే త్వరలో వైసీపీలో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories