సిమెంట్ కంపెనీల నుండి J-ట్యాక్స్ వసూలు : నారా లోకేశ్

సిమెంట్ కంపెనీల నుండి J-ట్యాక్స్ వసూలు : నారా లోకేశ్
x
Highlights

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ట్విట్టర్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిమెంటు కంపెనీల నుంచి...

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ట్విట్టర్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిమెంటు కంపెనీల నుంచి J-ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు తన ట్విట్టర్ లో 'లక్షకోట్ల క్విడ్ ప్రోకో కేసుల్లో మునిగితేలుతున్నా అక్రమ సంపాదనపై ఇంకా మోజు తీరలేదు @ysjaganగారికి. సిమెంట్ కంపెనీల నుండి J-ట్యాక్స్ వసూళ్ళు పూర్తయ్యేవరకు ఇసుక సమస్య తీరదు. అప్పటివరకు భవన నిర్మాణ కార్మికులు పనుల్లేక, ఆకలితో ఉండలేక అప్పులపాలు కావాల్సిందే. ప్రజల కన్నీటి చుక్కలతో తడిపితేనే కానీ మీ అక్రమాస్తుల కోటల పునాదులు బలంగా ఉండవు. అంతేనా జగన్ గారు?' అంటూ ట్వీట్ చేశారు లోకేశ్.

Show Full Article
Print Article
Next Story
More Stories