రివర్స్ లో నడిచి అసెంబ్లీకి వెళ్లిన టీడీపీ సభ్యులు

రివర్స్ లో నడిచి అసెంబ్లీకి వెళ్లిన టీడీపీ సభ్యులు
x
Highlights

ఏడు నెలల వైఎస్ జగన్ గారి పాలనలో ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసి ఏడిపించడం తప్ప సాధించింది ఏమీ లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు...

ఏడు నెలల వైఎస్ జగన్ గారి పాలనలో ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసి ఏడిపించడం తప్ప సాధించింది ఏమీ లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు చేశారు. రివర్స్ పాలనవల్ల సంక్షేమం, అభివృద్ధి అటకెక్కాయని అన్నారు. ఉన్న సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారని.. పాదయాత్రలో హామీ ఇచ్చిన నవరత్నాలు అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కొక్కటిగా రాలిపోతున్నాయని ఎద్దేవా చేశారు.

అంతేకాదు రివర్స్ పాలన, రిజర్వుడు టెండరింగ్ ద్వారా సొంత మనుషులకు ప్రజాధనం దోపిడీని ఆపాలని అసెంబ్లీ ఎదురుగా టీడీపీ నేతలతో కలిసి నిరసన తెలిపారు లోకేష్. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వినూత్నంగా రివర్స్ లో నడిచి అసెంబ్లీకి వెళ్లారు టీడీపీ సభ్యులు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories