టీడీపీకి మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి టాటా చెప్తారా!

టీడీపీకి మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి టాటా చెప్తారా!
x
Highlights

టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బీజేపీ గూటికి చేరుతారా? ఆయనతోపాటు మరికొందరు టీడీపీ నేతలు కూడా బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారా అంటే అవుననే సమాధానం...

టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బీజేపీ గూటికి చేరుతారా? ఆయనతోపాటు మరికొందరు టీడీపీ నేతలు కూడా బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల బీజేపీ వర్కింగ్ ప్రసిడెంట్ జయప్రకాశ్ నడ్డాతో సమావేశం అయ్యారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దాదాపు గంటపాటు నడ్డాతో.. జేసీ చర్చలు జరిపారట.ఈ సందర్బంగా జేసీని బీజేపీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఇదేక్రమంలో జేసీ తోపాటు రాయలసీమకు చెందిన ఒకరిద్దరు నేతలను కూడా తనవెంట తీసుకురావాలని నడ్డా కోరుతున్నారట. అందులో భాగంగా రాయలసీమకు చెందిన కొంతమంది టీడీపీ కీలకనాయకులతో జేసీ సంప్రదింపులు జరిపారని టాక్ వినబడుతోంది. కడప జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేతో జేసీ చర్చలు జరిపారట.

అలాగే కర్నూల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరితోను జేసీ మాట్లాడినట్టు ప్రచారం జరుగుతోంది. వీరు ఒకే అంటే అందరితో కలిసి జేసి దివాకర్ రెడ్డి బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇదిలావుంటే ఆయన కుమారుడు పవన్ రెడ్డి మాత్రం టీడీపీలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల పార్టీ యువనేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. ఆ సందర్బంగా పవన్ రెడ్డి మాట్లాడుతూ.. తాను ఏ పార్టీలోకి వెళ్లనని. టీడీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. కాగా పవన్ రెడ్డి గడిచిన ఎన్నికలో అనంతపురం ఎంపీ స్థానానికి పోటీచేసి వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య చేతిలో ఓడిపోయారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories