కడప జిల్లాలో టీడీపీకి షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత

కడప జిల్లాలో టీడీపీకి షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత
x
Highlights

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి త్వరలో వెఎస్సార్‌సీపీలో చేరనున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే వెల్లడించారు. టీడీపీలో తగిన ప్రాధాన్యత...

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి త్వరలో వెఎస్సార్‌సీపీలో చేరనున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే వెల్లడించారు. టీడీపీలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదని.. అందుకే తనతో పాటు తన కుమారుడు కలిసి సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరతామని స్పష్టం చేశారు. కాగా.. గత కొద్ది కాలంగా వీర శివారెడ్డి టీడీపీకి దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో కమలాపురం టికెట్‌ను వీరశివారెడ్డి ఆశించినా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆయనకు మొండిచెయ్యి చూపారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అయినా టిక్కెట్ ఇవ్వని కారణంగా ఎన్నికలో వైసీపీ అభ్యర్ధికి ఇండైరెక్ట్ గా పనిచేశారు.. అప్పటి నుంచే వీరశివారెడ్డి టీడీపీకి దూరంగా ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీనుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన వీరశివారెడ్డి.. 1994 లో కాంగ్రెస్ అభ్యర్థి మైసూరారెడ్డిపై గెలుపొందారు. ఆ తరువాత 2004 ఎన్నికల్లో కూడా టీడీపీ తరపున గెలుపొందారు.

అయితే 2004 లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పుత్తా నరసింహారెడ్డి టీడీపీలో చేరడంతో వీరశివారెడ్డి కాంగ్రెస్ లో చేరారు. 2009 లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించడం, రాష్ట్రం విడిపోవడం తోపాటు కాంగ్రెస్ కు కష్టకాలం రావడంతో మళ్ళీ టీడీపీలో చేరారు. 2014 లో కమలాపురం టిక్కెట్ ఆశించారు. కానీ ఆ ఎన్నికల్లో ఆయన చిరకాల ప్రత్యర్థి పుత్తా నరసింహారెడ్డికే టిక్కెట్ దక్కింది.. దాంతో చేసేదేమి లేక ఆయనకే సపోర్ట్ చేశారు. అయినా అక్కడ వైసీపీ విజయం సాధించింది. తిరిగి 2019 లో టీడీపీ టిక్కెట్ ఆశించారు.

కానీ మరోసారి పుత్తా నరసింహారెడ్డికి అవకాశం కల్పించింది టీడీపీ. చంద్రబాబు వైఖరితో మనస్థాపం చెందిన వీరశివా.. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి, సీఎం జగన్ మేనమామ అయిన పోచమరెడ్డి రవీంద్రనాధ్ రెడ్డికి సపోర్ట్ చేశారు. ఎమ్మెల్యేగా రవీంద్రనాధ్ రెడ్డి రెండో సారి విజయం సాధించారు. అయితే అప్పటినుంచి వైసీపీలో చేరడానికి ప్రయత్నాలు చేశారు. కానీ వైసీపీ అధిష్టానం నుంచి సరైన హామీ రాకపోవడంతో వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా వీరశివారెడ్డి వైసీపీలో చేరాలని తుది నిర్ణయం తీసుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories