వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ అనిత

వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ అనిత
x
Highlights

వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత. భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వానికి పట్టదా

వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత. భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. కొందరు కార్మికులు పనులు లేక ఆత్మహత్య చేసుకుంటుంటే మంత్రులు వారి కుటుంబాలను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. పనులు కల్పించలేని ప్రభుత్వం ఆత్మహత్యలను హేళన చేయడం సిగ్గుమాలిన చర్య అని దుయ్యబట్టారు. ఇసుక వారోత్సవాలు కంటే ఇసుక దోపిడి నివారోత్సవాలు పెడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు.

వరద ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ఉందా అని ఆమె అన్నారు. సొంత రాష్ట్రానికి ఇసుక సరఫరా చేయకుండా పక్క రాష్ట్రాలకు తరలించడంలో ఆంతర్యం ఏంటని అనిత నిలదీశారు. వైసీపీలో అందరు పరిపాలనాధక్షులే.. కానీ పాలనా అనుభవం లేదన్నారు. అలాంటివారు చంద్రబాబును సలహాలు అడిగితే బాగుంటుందన్నారు. చనిపోయిన ప్రతి కార్మిక కుటుంబానికి ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని కోరారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories