విశాఖలో రాజధానిని స్వాగతిస్తున్నాం: టీడీపీ నేత

విశాఖలో రాజధానిని స్వాగతిస్తున్నాం: టీడీపీ నేత
x
పల్లా శ్రీనివాసరావు
Highlights

విశాఖ ప్రాంతానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడాన్ని స్వాగతిస్తున్నట్టు టీడీపీ సీనియర్ నాయకుడు, గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

విశాఖ ప్రాంతానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడాన్ని స్వాగతిస్తున్నట్టు టీడీపీ సీనియర్ నాయకుడు, గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అయితే నగర ప్రశాంతత భంగం కలగకుండా రాజధాని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. అలాగే అమరావతిలోని రైతులకు ఎటువంటి నష్టం లేకుండా వారికి మేలు చెయ్యాలని సీఎం వైఎస్ జగన్ ను కోరుతున్నట్టు చెప్పారు. విశాఖలో రాజధానిని ఏర్పాటుచేసే బాగుంటుందని అభిప్రాయపడ్డ శ్రీనివాసరావు.. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్ర ప్రాంతం ఘనంగా అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం తమలో కలుగుతుందని అన్నారు. విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను స్వాగతిస్తూ..

తమ అభిప్రాయాల్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి పంపిస్తున్నట్టు ఆయన తెలిపారు. కాగా మంగళవారం రాత్రి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్బంగా విశాఖకు రాజధానిని రావడాన్ని స్వాగతిస్తున్నట్టు తీర్మానించారు. త్వరలో అధినేత చంద్రబాబును కూడా కలవాలని నిర్ణయించుకున్నారు. అయితే టీడీపీ అధిష్టానం మాత్రం మొత్తం రాజధాని అమరావతిలోని ఉండాలని కోరుతోంది. దీనిపై దీక్షలు,ధర్నాలు చేస్తోన్న రైతులకు సంకీభావం తెలిపింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories