తెలుగుదేశం పార్టీకి మరో షాక్.. కీలక నేత రాజీనామా

తెలుగుదేశం పార్టీకి మరో షాక్.. కీలక నేత రాజీనామా
x
Highlights

ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. తాజాగా ఆ పార్టీకి చెందిన నెల్లూరు జిల్లా కీలకనేత, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్...

ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. తాజాగా ఆ పార్టీకి చెందిన నెల్లూరు జిల్లా కీలకనేత, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు పంపారు. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బీద మస్తాన్ రావు పెద్దదిక్కుగా ఉన్నారు. గడిచిన ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి బీదమస్తాన్ రావు పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిపై 1,48,571 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.

అయితే, ఆ తర్వాత తన రాజకీయల్లో మార్పు వచ్చింది. ఆయనను మత్సకార సభ్యుడిగా ఏపీ ప్రభుత్వం నియమించింది. దాంతో అప్పటినుంచే ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోన్న తరుణంలో ఇవాళ(శుక్రవారం) తాను వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కాగా గత ఏడాది ఆయన వ్యాపారాల మీద ఐటీ దాడులు జరిగాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories