చిరంజీవిపై 'మళ్లీ దూకేస్తాడేమో' అంటూ సోమిరెడ్డి వ్యాఖ్యలు..

చిరంజీవిపై మళ్లీ దూకేస్తాడేమో అంటూ సోమిరెడ్డి వ్యాఖ్యలు..
x
Highlights

రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే మంచిదని.. అందరూ దీనిని స్వాగతించాలి సూచించారు మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి.

రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే మంచిదని.. అందరూ దీనిని స్వాగతించాలి సూచించారు మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి. అయితే చిరంజీవి అభిప్రాయంపై టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు తన పేస్ బుక్ పేజీలో ఓ పోస్ట్ షేర్ చేశారాయన. అందులో..

'అప్పుడేమో ప్రజలకోసమని ప్రజారాజ్యం పెట్టే..దాన్ని మరో పార్టీలో కలిపే. మంత్రి పదవి పొంది విభజన పాపంలో భాగమయ్యే.. ఇప్పుడు తమ్ముడు జనం కోసం పోరాడుతుంటే భుజం తట్టక మరో రాగమెత్తుకునే.. ఐనా తెలంగాణలో వ్యాపారాలు, సినిమాలు చేసుకునే పెద్దన్నకు ఏపీ జనం కష్టాలు ఏం తెలుస్తాయిలే. మళ్లీ దూకేస్తాడేమో..' అని పేస్ బుక్ లో పోస్ట్ చేశారు సోమిరెడ్డి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories