ఏప్రిల్ 28కి విశాఖ రాజ‌ధాని.. 5 రోజుల్లో ఎన్నిక‌లు..జ‌గ‌న్ స‌ర్కార్ పై టీడీపీ విమ‌ర్శ‌లు

ఏప్రిల్ 28కి విశాఖ రాజ‌ధాని.. 5 రోజుల్లో ఎన్నిక‌లు..జ‌గ‌న్ స‌ర్కార్ పై టీడీపీ విమ‌ర్శ‌లు
x
YSJagan (File photo)
Highlights

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ఏపీ ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ఏపీ ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. క‌రోనా వైర‌స్ ఉధృతంగా ఉన్న త‌రుణంలో రాష్ట్ర రాజ‌ధానిని విశాఖ త‌ర‌లించేందుకు సీఎం జ‌గ‌న్ ప్ర‌ణాళిక‌లు వేస్తున్నార‌ని అన్నారు. విశాఖను గ్రీన్ జోన్‌గా చూపించి అక్కడికి వెళ్లిపోయేందుకు సీఎం జగన్ కుట్రలు చేస్తున్నారని దేవినేని ఉమా ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై వాస్తవాలను తొక్కి పెడుతున్నారని మండిప‌డ్డారు. కరోనాపై ప్ర‌భుత్వం సీరియస్‌గా దృష్టిపెట్టాలని, లేకుంటే ఇంకా దారుణ పరిస్థితులు నెలకొంటాయని దేవినేని ఉమ అన్నారు.ఏప్రిల్ 28 నాటికి విశాఖ వెళ్లాల‌ని ఓ స్వామీజీ చెప్పారని అందుకే జగన్ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. విశాఖపట్నంను గ్రీన్ జోన్‌గా సరిగా క‌రోనా వైర‌స్ పరీక్షలు నిర్వహించటం లేదన్నారు.

విజయవాడ, గుంటూరు జిల్లాలు రెడ్ జోన్‌లో ఉన్నాయని, విశాఖ‌లో గ‌త కొన్ని రోజులుగా వైర‌స్ ప‌రీక్ష‌లు స‌క్ర‌మంగా నిర్వ‌హించ‌డంలేద‌ని ఆరోపించారు. వాస్తవాలను తొక్కి పెడుతున్నారని ఆయ‌న అన్నారు. రాష్ట్రంలో ల్యాబ్‌లు, టెస్టులు ఎందుకు పెంచట్లేదని దేవినేని ఉమ ప్రశ్నించారు. 300 క‌రోనా ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన రిపోర్టులు బయటపెట్టలేదని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మంగళవారంతో ఎత్తివేస్తే ఐదు రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని జ‌గ‌న్ స‌ర్కార్ ప్రయత్నించిందని దేవినేని ఉమా తెలిపారు. ఐసోలేషన్‌కు ఎంత ఖర్చు లెక్కలు చూపాలని డిమాండ్ చేశారు. నిర్మాణ‌త్మ‌క ప్రతిపక్షంగా ప్రజల కష్టాలు ప్రభుత్వం దృష్టికి.. తీసుకెళ్తుంటే మంత్రులతో బుతులు తిట్టిస్తూ.. రాజ‌కీయాలు చేస్తున్నార‌ని విమర్శించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories