Corona Effect: స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలి: సోమిరెడ్డి


కరోనా వైరస్ (కొవిడ్-19) భారత్‌లో రోజు రోజుకు వేగంగా విస్తరిస్తోంది. ఈ మహహ్మరి భయం ప్రజలను పట్టిపీడిస్తోంది.
కరోనా వైరస్ (కొవిడ్-19) భారత్‌లో రోజు రోజుకు వేగంగా విస్తరిస్తోంది. ఈ మహహ్మరి భయం ప్రజలను పట్టిపీడిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ ధాటికి ప్రపంచవ్యాప్తంగా 5వేల400 మందిపైగా మరణించారు. మన దేశంలో కోవిడ్ వల్ల రెండు మరణాలు సంభవించాయి. కర్ణాటకలోని కలబుర్గి, ఢిల్లీలో కరోనాతో మృతి చెందారు. కరోనా అన్ని రంగాలపై ప్రభావం చూపిస్తోంది.
ఇదిలావుంటే మరోవైపు ఏపీలో స్థానిక ఎన్నికలు సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి అధికార వైసీపీలోకి జోరుగా వలసలు కొసాగుతున్నాయి. కాగా.. టీడీపీ ఓ కొత్త వాదన తెరపైకి తెచ్చింది. కరోనా వైరస్ రాష్ట్రంలో విస్తరిస్తున్న కారణంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.
నెల్లూరులో కరోనా పాజిటివ్ వచ్చిందని, ఎన్నికలను వాయిదా వేయాలని కోరారు. కరోనా కేసు నమోదైన నెల్లూరులో పాఠశాలలు, థియేటర్లు మూసివేశారని సోమిరెడ్డి గుర్తు చేశారు. ప్రజల రక్షణ కంటే ఎన్నికలే ముఖ్యమా అని ప్రశ్నించారు. నామినేషన్లు ఒక్కటే పూర్తయ్యాయని, ఎన్నికలు తేదీ వాయిదా ఏం మునిగిపోదని తెలిపారు. కరోనా వైరస్ వలన ప్రజలకు ఏమైనా జరిగితే ప్రభుత్వం బాద్యత వహించాలని అన్నారు.
కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా ఎన్నికలను వాయిదా కోరారు. కానీ, ఎన్నికల్లో ఓటు వేసేందుకు రాష్ట్రంలోని ప్రజలు క్యూల్లో నిలబడాల్సి ఉంటుందని, అలా వారికి కరోనా విస్తరించే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వానికి జనాలు ఏమైనా పర్వాలేదనట్లు ఉందని, ఎన్నికలే కావాలని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల ప్రాణాల కంటే ఎన్నికలే ముఖ్యమా..నామినేషన్లు పూర్తయ్యాయి..ఎన్నికల తేదీ వాయిదా వేస్తే కొంపలేం మునిగిపోవు..కరోనా వైరస్ మరింత విస్తరించి ప్రజలకు ఏమైనా జరిగితే ప్రభుత్వం, అధికార యంత్రాంగం, ఎన్నికల కమిషన్ దే బాధ్యత...
— Somireddy Chandra Mohan Reddy (@Somireddycm) March 14, 2020
#Carona #LocalBodyElections pic.twitter.com/Ki09tRFrUo

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



