టీడీపీ కుట్రపూరితంగా రూల్‌ 71ను తెరపైకి తెచ్చింది : మంత్రి బుగ్గన

టీడీపీ కుట్రపూరితంగా రూల్‌ 71ను తెరపైకి తెచ్చింది : మంత్రి బుగ్గన
x
టీడీపీ కుట్రపూరితంగా రూల్‌ 71ను తెరపైకి తెచ్చింది : మంత్రి బుగ్గన
Highlights

బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపే విషయంలో శాసనమండలి ఛైర్మన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. బుధవారం...

బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపే విషయంలో శాసనమండలి ఛైర్మన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం మండలిలో జరిగిన ఈ వ్యవహారంపై బుగ్గన గురువారం అసెంబ్లీలో వివరణ ఇచ్చారు.

అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై చర్చించి ఆమోదం తెలపడమో లేకపోతే సవరణలతో శాసనసభకు తిరిగి పంపించడమో చేయాలని కానీ టీడీపీ కుట్ర పూరితంగా రూల్ 71 అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి నిబంధనలను ఉల్లంఘించారన్నారు. నిజానికి రూల్‌ 71 కింద బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి రిఫర్‌ చేసే అధికారమే లేదని బుగ్గన తెలిపారు. నాలుగు గంటల పాటు గ్యాలరీలో కూర్చున్న చంద్రబాబు ఛైర్మన్‌ను ప్రభావితం చేశారని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories