ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు.. ప్రభుత్వం వైఫల్యం : మాజీ మంత్రి అచ్చెన్నాయుడు

ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు.. ప్రభుత్వం వైఫల్యం : మాజీ మంత్రి అచ్చెన్నాయుడు
x
Highlights

రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంపుపై తెలుగుదేశం పార్టీ మండిపడుతోంది. వైసీపీ అధికారంలోకి వస్తే ఏ చార్జీలను పెంచమని హామీ ఇచ్చారని.. కానీ ఎందుకు...

రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంపుపై తెలుగుదేశం పార్టీ మండిపడుతోంది. వైసీపీ అధికారంలోకి వస్తే ఏ చార్జీలను పెంచమని హామీ ఇచ్చారని.. కానీ ఎందుకు పెంచారని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఛార్జీలను పెంచడం ద్వారా ప్రజలకు ప్రభుత్వం ద్రోహం చేసిందని అన్నారు. బస్సు ఛార్జీల పెంపు ప్రభుత్వం వైఫల్యాన్ని సూచిస్తుందని ఆయన అన్నారు. ఆర్టీసీ రూ .1,200 కోట్ల నష్టాన్ని చవిచూస్తోందని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

టీడీపీ ప్రభుత్వం ఛార్జీలను పెంచలేదని, కొత్త బస్సులు కొనడానికి నిధులు కేటాయించడం ద్వారా ఆర్టీసీని బలోపేతం చేయడానికి ప్రయత్నించామని ఆయన అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు టీడీపీ ప్రభుత్వం 42 శాతం ఫిట్‌మెంట్ మంజూరు చేసిందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం బస్సు ప్రయాణికులకు అదనపు సౌకర్యాలు కల్పించనపుడు.. ఛార్జీలను ఎందుకు పెంచుతోందని ప్రశ్నించారు. వైసీపీప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని అచ్చెన్నాయుడు అభివర్ణించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన ఖండించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories