నేడు, రేపు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన

నేడు, రేపు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన
x
Highlights

నేడు, రేపు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన నేడు, రేపు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని పది నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు. ఇందుకోసం టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. మరోవైపు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా రేపు జిల్లాకు వస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దీంతో వైసీపీ, టీడీపీల మధ్య ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది. కాగా అక్టోబర్ 14 నుండి 15 వరకు అధికార వైయస్ఆర్ కాంగ్రెస్‌కు ధీటుగా పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని టీడీపీ ద్వితీయ శ్రేణి క్యాడర్‌ ప్రణాళికలు రచిస్తోంది.

2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలను, రెండు పార్లమెంటరీ స్థానాలను కోల్పోయింది. దీంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకోసం టీడీపీ నాయకత్వాన్ని పటిష్ఠపరచాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగానే నెల్లూరు పర్యటనకు వచ్చారు. మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ, బీద రవిచంద్ర యాదవ్ ఇటీవల పార్టీ నాయకులతో సమావేశమై చంద్రబాబు పర్యటనపై చర్చించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories